శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ రైలు(నం.18525/26) నిర్వహణ నేపథ్యంలో ఇటీవల రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటిచింది. ఈ రద్దు 8, 9, 10, 11, 12, 13 తేదీల వరకు కొనసాగుతుందని తెలిపింది. పలాస-విశాఖ మెము రైలు 9, 11, 13 తేదీల్లో విజయనగరం వరకే వెళ్తుందని తాజాగా తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.