ASR: పాడేరు ఐటీడీఏ పీవోగా తిరుమణి శ్రీపూజ సోమవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకూ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఐటీడీఏ ఇంఛార్జ్ పీవోగా బాధ్యతలను నిర్వహించారు. ఈ క్రమంలో 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమణి శ్రీపూజను పాడేరు ఐటీడీఏ పీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సోమవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు.