PPM: జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి పంచాయతీ నందివాని వలస నుంచి సింగనాపురం వెళ్లే రోడ్డు బురదతో గోతులుగా మారింది. 5 కిలోమీటర్ల మేర ఇలానే ఉండటంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రోడ్డు వేయాలని లేకపోతే కంకర వేసి బాగు చేయాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.