KNR: మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి ఉన్నందున ముందస్తుగా తిమ్మాపూర్ మండల మాల నాయకులను ఎల్ఎండీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అని మాల మహానాడు నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణ భాగంగా ప్రభుత్వం ఖరారు చేసిన రోస్టర్ పాయింట్లలో మాలలకు, వారి అనుబంధ కులాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.