KMM: స్థానిక సంస్థల ఓటర్ జాబితాపై సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. MPTC, ZPTC స్థానాల వారీగా ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితా తయారీ కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆయా పార్టీల ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు.