JN: పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సృజన్ కుమార్ ప్రకారం.. గ్రామానికి చెందిన కందుల సందీప్ (22) ను తండ్రి కుటుంబ వ్యవహార విషయంలో మందలించాడని ఈ నెల 1న పొలం వద్ద గడ్డి మందు తాగాడు. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.