ADB: తాంసి మండలంలోని పొన్నారి అంతర్రాష్ట్ర రహదారి పక్కన హరితహారం కింద నాటిన చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొక్కలు నాటబడ్డాయి. అధికారుల పర్యవేక్షణలో పెరిగిన మొక్కలు పెద్ద చెట్లుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఆ చెట్లు విద్యుత్ స్తంభాలకు ఆనుకుని ఉన్న కొమ్మలను కట్ చేస్తూ కొన్ని చోట్ల పూర్తిగా నరికివేయడం ఆందోళన చెందుతున్నారు.