MDCL: బాలానగర్ Y-జంక్షన్ వద్ద ఎక్సైజ్ పోలీసులు కొకైన్ పట్టుకున్నారు. రూ.3 లక్షల విలువైన 23.98 గ్రాముల డ్రగ్స్ సీజ్ చేశారు. మేడ్చల్ డీటీఎఫ్ CI నర్సిరెడ్డి, SI పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. నిందితుడు సంతోష్ యాదవ్ (43)ను అరెస్ట్ చేశారు. ఇతడు గతంలో బేగంపేట STF ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడినట్లు తేల్చారు.