PLD: మాచర్ల మండలం విజయపురిసౌత్ మత్స్యకారుల కాలనీలో రూ.3.59 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. ఆదివారం సాగర్ క్యాంప్ లంకమోడు, డౌన్ మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, సీసీ, బీటీ రోడ్లతో సహా మొత్తం 18 రకాల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల హామీల ప్రకారం ఈ ప్రాంత సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు.