HYD: వినాయక చవితి ఉత్సవం, నిమజ్జనం కార్యక్రమం సజావుగా జరిగేలా తమ వంతు సహకారం అందించిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, మీడియా, ప్రజలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. GHMC యంత్రాంగం, ప్రభుత్వ శాఖలు చేసిన ఏర్పాట్లను, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా క్రియాశీలకంగా వ్యవహరించిందని కొనియాడారు.