అన్నమయ్య: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని YCP నేతలు సిబ్యాల విజయభాస్కర్, ఈశ్వర్ ప్రసాద్ బుజ్జిబాబు ఆరోపించారు. ఆదివారం రాయచోటిలోని YCP కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. గత ఏడాది వర్షాభావం, ఈ ఏడాది అనావృష్టితో పంటలకు నష్టం వాటిల్లిందని, విత్తనాలు, ఎరువులు సరఫరా కాక రైతులు రోడ్డెక్కే పరిస్థితిలో ఉన్నారని వారు తెలిపారు.