AP: మహిళల క్రికెట్ ప్రపంచకప్ మ్యాచులు విశాఖలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ACA-VDCA స్టేడియంలో ట్రోఫీని ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీశ్, ఏసీఏ సభ్యులు ఆవిష్కరించారు. ఈ టోర్నీలో ఐదు మ్యాచులు విశాఖలో జరగనున్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెటర్లు విశాఖకు వస్తున్నట్లు సతీశ్ తెలిపారు. తొలి మ్యాచ్కు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు.