JGL: పెగడపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గ విజ్ఞాన యాత్రలో భాగంగా బుధవారం గోవాలోని మపూస మార్కెట్‌ను ఛైర్మన్ రాములు గౌడ్ బృందం సందర్శించింది. అక్కడి రైతులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, పంటల కొనుగోలు ప్రక్రియ, విక్రయ పద్ధతులను పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ఇతర రాష్ట్రాల్లోని మెరుగైన విధానాలను అధ్యయనం చేసి, మన మార్కెట్లలో రైతులకు సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు.