NLR: కందుకూరు నియోజకవర్గంలో ఆధార్ కార్డులు లేక సంక్షేమ పథకాలను పొందలేకపోతున్న ఎస్టీల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు 6 రోజుల పాటు అన్ని మండలాలలో క్యాంపులను నిర్వహిస్తారని అన్నారు. ఇప్పటికీ ఆధార్ కార్డులు లేని గిరిజనులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.