మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని దివిటిపల్లి డబల్ బెడ్ రూమ్ ప్రాంతానికి చెందిన ముత్యాల ప్రభాకర్ అనారోగ్య కారణాలతో ఈరోజు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక యువ కాంగ్రెస్ నేత జే.చంద్రశేఖర్ అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.