అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో ఆదివారం రోడ్డు పక్కన నిలబడిన లియాకత్ అలీ (63) అనే వృద్ధుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.