ప్రకాశం: కనిగిరి మండల టీడీపీ నూతన అధ్యక్షునిగా కొండ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆదివారం కనిగిరి మండలం దిరసవంచ గ్రామ పార్టీ అధ్యక్షులు వీరయ్య, తెలుగు యువత ఉపాధ్యక్షులు దేవాంగ బ్రహ్మం స్థానిక టీడీపీ కార్యాలయంలో కలిసి కొండ కృష్ణారెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు తిరివీధి కోటేశ్వరరావు, గారపాటి సుబ్బారావు కూడా పాల్గొన్నారు.