GNTR: చంద్రగ్రహణం సందర్భంగా పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని (శివాలయం) ప్రధాన ద్వారం ఈరోజు మధ్యాహ్నం మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 7 గంటల తరువాత ఆలయ సంప్రోక్షణ అనంతరం దేవస్థానాన్ని తెరవనున్నట్లు ఆలయ ఏసి గోగినేని లీలా కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వాములు, సిబ్బంది పాల్గొన్నారు.