RR: ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలో ఆదివారం రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA హాజరై పోటీలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు చదువుతో పాటు కరాటేలోను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.