KDP: ఈనెల 10వ తేదీన అనంతపురంలో సూపర్-6 సూపర్ హిట్ విజయోత్సవ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజుతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పార్కింగ్ ఏర్పాట్లు కూడా పక్కాగా ఏర్పాటు చేయాలని వారు సూచించారు.