GNTR: తుళ్లూరు మండలం దొండపాడు ప్రాంతంలో ఎన్16 రోడ్డు నిర్మాణ పనులు ఆదివారం వేగంగా సాగుతున్నాయి. దొండపాడు టిడ్కో గృహాల సమీపంలో రోడ్డు సరిగా లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని టిడ్కో గృహాల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.