SKLM: నరసన్నపేటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతి గ్రాండ్-2 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలను ఎంఈఓ లు దాలినాయుడు, శాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం 9వ తరగతి ఫైనల్ పరీక్షలను పరిశీలించారు.