AKP: జీడి రైతులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేజీకి రూ.200 మద్దతు ధర ప్రకటించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి డిమాండ్ చేశారు. నాతవరంలో బుధవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడిపిక్కలను కొనుగోలు చేయాలని, బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా తోటల అభివృద్ధి చేయాలని కోరారు.