ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణపతి మండపానికి రూ.11 లక్షలను బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ విరాళంగా ఇచ్చారు. తన బృందం ద్వారా ఆ చెక్కును ఆలయ అధికారులకు అందించారు. దీంతో కొందరు నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తుండగా .. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ డబ్బుతో పంజాబ్ వరద బాధితుల కోసం సహాయం చేసి ఉంటే మంచిది కాదా?, దేవునికి కాదు.. మానవాళికి సాయం చేయండి అని చెబుతున్నారు.