Bandi sanjay complaint to police for missing mobile
తెలంగాణ హిందీ పదో తరగతి ప్రశ్నాపత్రం (Telangana hindi paper leak) బయటకు వచ్చిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana chief Bandi Sanjay) విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం (State Government) హైకోర్టుకు (High Court) తెలిపింది. హన్మకొండ విధించిన రిమాండ్ ను కొట్టి వేయాలని కోరుతూ బండి సంజయ్ (Bandi Sanjay) దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం మరోసారి విచారణ జరిపారు. ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ విచారణకు సహకరించడం లేదని తెలంగాణ అడ్వోకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. తన మొబైల్ పోన్ ను (Mobile Phone) పోలీసులకు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. సంజయ్ ఫోన్ ను (Bandi Sanjay) విశ్లేషిస్తే ప్రశ్నాపత్రాలు బయటకు రావడంపై జరిగిన కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాదనలు వినిపించేందుకు బండి సంజయ్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం.