WGL: వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస రావు సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ ఈవో రామాలమ సునీత, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.