GNTR: టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం అందించే ‘స్త్రీ శక్తి’ పథకం ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. శనివారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆగస్టు 15న పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళల్లో భరోసా, స్వావలంబన పెరిగాయని పేర్కొన్నారు.