VZM: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి కోరారు. స్థానిక ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఛార్జ్ లెవెల్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎస్ సేధు మాధవన్, సీపీవో పి.బాలాజీ పాల్గొన్నారు.