VSP: విశాఖ జిల్లాలో తాగునీరు, వీధి దీపాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలు పరిష్కరించామని హమీ ఇచ్చారు.