VKB: పరిగి మండలం పెద్ద మాదారం గ్రామంలో గణపతి లడ్డూ వేలం రికార్డు ధర పలికింది. వినాయకుని మండపం వద్ద నిర్వహించిన ఈ వేలంలో ఎక్కిచర్ల గోపాల్ లడ్డూను రూ.1,25,000కు ఇవాళ కైవసం చేసుకున్నారు. విఘ్నేశ్వరుని దీవెనలతో తన కుటుంబంతో పాటు గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, మంచి పంటలు పండి ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు గోపాల్ తెలిపారు.