W.G: మిషన్ శక్తి సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. పని ప్రాంతాల్లో మహిళల భద్రత, పోక్సో చట్టంతో పాటు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ప్రధానోపాధ్యాయురాలు టి.వరలక్ష్మి, డీసీపీవో యూనిట్ సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు.