BDK: మణుగూరు ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఇల్లందు గెస్ట్ హౌస్లో జర్నలిస్ట్ డేను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిల జర్నలిస్టులు పనిచేస్తారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల హక్కులు భంగం కలగకుండా చూడాలన్నారు.