TG: హైదరాబాద్లో నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని డీజీపీ జితేందర్ అన్నారు. ‘ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటలలోపు బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తవుతుంది. నిమజ్జనం కోసం ప్రత్యేక బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా భక్తులు పోలీసులకు సహకరించాలి’ అని సూచించారు.