కృష్ణా: మోపిదేవి తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన హరనాథ్‌ను టీడీపీ పార్టీ నేతలు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు తహసీల్దార్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండలంలోని తాజా పరిస్థితుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.