తూ.గో జిల్లా పౌల్ట్రీ రైతులకు జిల్లా పశుసంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు జాగ్రత్త చర్యలపై శనివారం ప్రకటన ద్వారా పలు సూచనలు ఇచ్చారు. జిల్లాల్లో వివిధ కారణాల వల్ల కోళ్లు అధిక శాతం మృత్యువాత పడుతున్నాయన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు, పెరటి కోళ్ల పెంపకందార్లు, మార్కెట్లలో వ్యాపారస్తులు ఫారాల్లో బయో సెక్యూరిటీ ప్రమాణాలు పాటించాలన్నారు.