ADB: భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతుల సమస్యల పట్ల ఉద్యమించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో MLA పాయల్ శంకర్‌తో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లాధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు తదితరులు ఉన్నారు.