KNR: శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామ శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి ద్విచక్ర వాహనం బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచరం అందుకున్న 108 సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.