KMR: సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి హెమిమా సూచించారు. శనివారం బిక్కనూర్లోని పాత హరిజనవాడ ప్రాంతంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. శిబిరాలను ఈనెల 15వ తేదీ వరకు అన్ని గ్రామాలలో కొనసాగిస్తామని తెలిపారు.