NGKL: అచ్చంపేట పట్టణ శివారులోని శితరాలగుట్టలో కొత్తగా నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్ కోసం స్థలాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఈ క్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ మురళి, ఏఈ ఆంజనేయులు, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.