SKLM: మాదకద్రవ్యాల వినియోగం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఈగల్ టీం సభ్యులు ఉదయ్ కుమార్, రామచందర్రావు తెలిపారు. శనివారం శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల జోలికి పోతే జీవితాలు సర్వనాశనం అవుతాయని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇటువంటివి జరిగినట్లయితే 1972 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.