VSP: దువ్వాడ సమీపంలో సెనర్జీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికులు జీతాల కోసం శనివారం ఉదయం రోడ్డెక్కారు. గత ఆగస్టు నుంచి జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 457 మంది ఆందోళనకు దిగారు. ప్రభుత్వ యంత్రాంగం కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.