కృష్ణా: మహిళలు రాజకీయాల్లో ముందుకు వచ్చి ఎదగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్‌గా నియమితులైన చల్లపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న బుద్ధప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు.