TPT: ఏర్పేడు పంచాయతీలో శనివారం డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో మండలంలో అభివృధ్ది పనులు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్రిష్ణవేణి, బాలాజీ పాల్గొన్నారు.