వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలిస్తే తనను సీఎం చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తెలిపారు. అమిత్ షా స్వయంగా ఈ హామీ ఇచ్చారని చెప్పి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలో ఏర్పడిన కూటమిలో బీజేపీ భాగస్వామ్యం పంచుకుందని ఆ పార్టీ అధిష్టానం పెద్దలు పలుమార్లు ప్రకటించారని గుర్తుచేశారు.