ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరమ్మ దేవాలయం ఆదివారం మూసి వేస్తున్నట్లు ఆలయ నిర్వహణాధికారి రమేశ్ తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా వల్లూరమ్మ తల్లి దేవస్థానం భద్రపదశుద్ధ పౌర్ణమి రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి దేవాలయం మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో రమేశ్ తెలిపారు. తిరిగి సోమవారం వల్లూరమ్మ తల్లి దర్శనం భక్తులకు కలిగిస్తామన్నారు.