ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో గల శ్రీరామ మందిరాన్ని ఎస్సై జీవన్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమై మాట్లాడారు. నిమజ్జనం ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.