కరీంనగర్లోని 23వ డివిజన్ సూర్య నగర్లో గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద శుక్రవారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో ఊహించని ధర పలికింది. వేలం పాట పోటా పోటీగా కొనసాగి చివరగా స్థానికులు శనిగరం మంజుల, నర్సయ్య దంపతులు రూ. 1,82,000కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొలుపుల మోహన్, ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.