TG: హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది. గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యారు. 11 రోజులపాటు లంబోదరులు పూజలందుకున్నారు. నగరంలో ఈ 11 రోజుల పాటు వినాయక మండపాలు కళకళలాడాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాలు నిర్వహించారు. ఇప్పటికే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి.