»Minister Ktrs Visit To Sirisilla District Initiation Of Many Development Works
Minister KTR : సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్ సంఘ(Mudiraj Sangha) భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్ సంఘ(Mudiraj Sangha) భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్(Substation) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురి నుంచి వినపత్రాలు స్వీకరించిన మంత్రి కేటీఆర్, యువకులతో కలిసి సెల్ఫీలు దిగారు. పారిశ్రామికాభివృద్ధి(Industrial development)తో పాటు సంక్షేమంలోనూ తెలంగాణను మొదటి స్థానంలో నిలిపామని స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోటీ 10లక్షల నిధులతో నిర్మించిన షాదీఖానా భవనం, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో రూ.20లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూం(Digital classroom) ను ప్రారంభించారు. విద్యార్థుల ప్రదర్శనలు తిలకించిన అనంతరం వారిని అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పల్లె , బస్తీ దవాఖానా(Basti Davakhana) హెల్త్ ప్రొఫైల్, కేసీఆర్ కిట్ వంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. దళితబంధు పథకం కింద మంజూరైన పౌల్ట్రీఫాంను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట(Ellareddypet) మండలానికి చేరుకుంటారు. మండలంలోని దుమాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత చిట్టివాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనం, రూ.10 లక్షలతో మహిళా సంఘ భవనం, చిట్టివాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభిస్తారు.