HYD: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కుషాయిగూడ డివిజన్ శివసాయి నగర్లో రూ. 4 కోట్ల 55 లక్షలతో జరుగుతున్న బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పలు కాలనీలు వరద మురుగు నీటి ముంపుతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.